జై లవ కుశ: రావణుడిలా భయంకరంగా ఎన్టీఆర్ ‘జై’ పాత్ర

0
645

Times Of Nellore (Cinema )- ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘జై లవ కుశ’ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహస్తున్నఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. జై, లవ, కుశ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. గురువారం సాయంత్రం 5.22 గంటలకు జై పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. టీజర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

టీజర్ డైలాగ్స్ అదుర్స్

ఆ రావణుడిని చంపాలంటే సముద్రం దాటాలి… ఈ రావణుడిని చంపాలంటే సముద్రమంత దైర్యం ఉండాలి అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ టీజర్ కే హైలెట్ అయ్యాయి.

భయంకరమైన పాత్ర జై

సినిమాలో ‘జై’ పాత్ర చాలా భయంకరంగా ఉంటుందని…. అత్యంత కర్కశమైన విలనిజంతో కూడుకుని ఉంటుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ హాభావాలు అదుర్స్

ఈ టీజర్లో ఎన్టీఆర్ హావభావాలు అదిరిపోయే విధంగా…. నటనలో రౌద్రం ప్రదర్శిస్తూ ఎన్టీఆర్ నిజంగానే ప్రేక్షకులను భయపెట్టాడు. టీజర్ ఇలా ఉందంటే సినిమాలో ఇంకా ఏం రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.జై’ పాత్రకు కాస్త నత్తి కూడా ఉంటుందని ఈ టీజర్లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ వింటే స్పష్టమవుతుంది. ఈ రావణుడిని చంపాలంటే సముద్రమంత దదదధై…ర్యం ఉండాలి అంటూ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన విషయాన్ని మనం గమనించవచ్చు.

హీరోయిన్లు – రిలీజ్ డేట్

ఎన్టీఆర్ పోషిస్తున్న రెండు పాత్రలకు రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఒక పాత్రకు హీరోయిన్ లేదని తెలుస్తోంది.జై ల‌వ‌కుశ చిత్రం సెప్టెంబ‌ర్ 21న విడుదల కానుంది. బాలీవుడ్ యాక్ట‌ర్ రోనిత్ రాయ్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

SHARE

LEAVE A REPLY