‘ఇండియన్ 2’ సేనాపతి స్పెషల్ లుక్..

0
92

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –  భారతీయ చలన చిత్ర రంగంలో స్టార్ డైరెక్టర్ గా శంకర్ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. తన సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ అందిస్తూ ఎంతో మందికి స్ఫూర్తి అందించారు. దాదాపు 23 ఏళ్ళ క్రితం అంటే 1996లో భారతీయుడు చిత్రంతో ప్రేక్షకులని పలకరించారు కమల్ హాసన్. ఇందులో సేనాపతిగా లంచగొండితనంపై పోరాటం చేస్తారు. లంచం తీసుకున్నాడని తన సొంత కొడుకునే చంపేయడం సినిమాలో సంచలనం.

తన కొడుకును చంపిన తర్వాత సేనాపతి విదేశాలకు వెళ్లిపోతూ..ఎప్పుడైనా మళ్లీ అన్యాయం జరిగితే ఈ సేనాపతి మళ్లి వస్తాడని చెప్పడంతో ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని చెప్పకనే చెప్పారు. అయితే ఈ సీక్వెల్ తెరపైకి రావడానికి దాదాపు 23 ఏళ్లు పట్టింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ఇండియన్ 2 చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాని తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఏక కాలంలో రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా సేనాపతి పాత్రకు సంబంధించిన స్పెషల్ లుక్ ను విడుదల చేశారు.

ఎత్తుగా కనిపిస్తున్న ఓ కోటపై నిలబడివున్న కమల్ ఇందులో కనిపిస్తుండగా, ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. తొలి భాగంలోని డ్రస్సింగ్ స్టయిలే ఇందులోనూ కనిపిస్తోంది. ఈ మూవీలో కమల్‌హాసన్‌కి జోడీగా కాజల్ నటించనున్నారు . రకుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా భవానీ శంకర్, దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలలో, అజయ్‌ దేవ్‌గణ్‌ నెగటివ్‌ పాత్రలో నటిస్తారని సమాచారం . లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. గతంలో ఈ మూవీలో లంచగొండితనపై పోరాడిన సేనాపతి ఈసారి కుళ్లిపోతున్న రాజకీయాలపై సమరభేరీ మోగిస్తారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ మూవీతో ఏ సంచలనం రేపనున్నారో డైరెక్టర్ శంకర్.

SHARE

LEAVE A REPLY