హమ్మయ్య..జూనియర్ దేవరకొండకు హిట్ పడింది!!

0
85

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. కానీ వచ్చిన వారసులంతా హిట్ కొడతారన్న గ్యారెంటీ లేదు. నిలబడతారన్న నమ్మకం లేదు. ఎంట్రీ ఈజీగానే దొరికినా కూడా కొందరు అస్సలు నిలబడరు. ఇప్పుడు మరో వారసుడు కూడా తన ఉనికి చాటుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడే ఆనంద్ దేవరకొండ కేరాఫ్ విజయ్ దేవరకొండ. దొరసాని సినిమాతో గతేడాది ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఈ జూనియర్ దేవరకొండ. అచ్చంగా అన్న మాదిరే వాయిస్ ఉంటుంది ఈయనది కూడా.

అయితే తెలంగాణ నేపథ్యంలో వచ్చిన దొరసాని సినిమాకు ప్రశంసలు అయితే దక్కాయి కానీ విజయం మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు ఈయన రెండో సినిమా విడుదలైంది. మిడిల్ క్లాస్ మెలొడీస్ అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది. ఓటిటిలో వచ్చిన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సినిమా చాలా బాగుంది అనే టాక్ తెచ్చుకుంది. సింపుల్ కథకు తనదైన స్క్రీన్ ప్లేతో మాయ చేసాడు కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు.

ఆనంద్ దేవరకొండ కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్. మరోవైపు హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. మొత్తంగా మన పక్కింట్లో జరిగే కథలా ఉన్న ఈ సినిమాకు ఓటిటిలో మంచి రెస్పాన్స్ వస్తుంది. కచ్చితంగా అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఈ చిత్రం లాభాలు తీసుకొచ్చేలా కనిపిస్తుంది. టాక్ బాగుండటంతో వ్యూస్ కూడా బాగానే వచ్చేలా కనిపిస్తున్నాయి. మరి చూడాలిక.. ఈ సినిమా తెచ్చిన గుర్తింపుతో తన కెరీర్‌ను ఆనంద్ దేవరకొండ ఎలా ప్లాన్ చేసుకుంటాడో..?

SHARE

LEAVE A REPLY