పడబోతున్న కంచెను అడ్డుకుని..

0
82

Times of Nellore (Chennai) # సూర్య # – తమిళ స్టార్‌ విజయ్‌కు అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన్ను చూడటం కోసం, కలిసి సెల్ఫీ దిగడం కోసం అభిమానులు బారులు తీరుతుంటారు. తాజాగా ఆయనకు వింత అనుభవం ఎదురైంది. ప్రస్తుతం విజయ్‌ తన 63వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. చెన్నై శివారులో ఉన్న ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్శిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఆయన్ను చూడటానికి అభిమానులు సెట్‌ దగ్గర ఉన్న కంచె (ఇనుప కడ్డీలతో నిర్మించింది) వద్ద గుమిగూడారు. బృందంతో కలిసి అటుగా వెళ్లిన విజయ్‌.. ఫ్యాన్స్‌ను పలకరిస్తూ నడుస్తున్నారు. ఈ క్రమంలో చిన్నపాటి తొక్కిసలాంటి ఘటన జరిగి కంచె ముందుకు పడబోయింది. దీంతో విజయ్‌ వెంటనే కంచె పడకుండా పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆయనతోపాటు బాడీగార్డులు, మిగిలిన వారంతా కంచె కింద పడకుండా ఆపారు. ఈ సందర్భంగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. కంచె కిందపడి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని, విజయ్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించారని అభిమానుల్ని కాపాడారని నెటిజన్లు మెచ్చుకున్నారు. విజయ్‌ నిజమైన హీరో అని మరికొందరు అన్నారు.

SHARE

LEAVE A REPLY