గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన ‘పలాస’ ఫేమ్ నక్షత్ర!!

0
84

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ఆదర్శ నగర్ లో హీరోయిన్ నక్షత్ర ( పలస 1978 ) మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నక్షత్ర మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అని అందులో భాగంగా నేను మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.
పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు . “విరివిగా మొక్కలు నాటండి పచ్చదనాన్ని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అని తెలిపారు”. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్, హీరోయిన్ రమ్యకృష్ణ ,’పలాస 1978′ సినిమా డైరెక్టర్ కరుణ కుమార్ లను గ్రీన్ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని నక్షత్ర పిలుపునిచ్చారు.

SHARE

LEAVE A REPLY