అక్షయ్ గొప్ప మనసు.. మరోసారి భారీ విరాళం..!!

0
52

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒– బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి పెద్ద మనసును చాటుకున్నారు. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే పీఎం కేర్స్ ఫండ్ కు, ముంబై మునిసిపల్ కార్పొరేషన్, ముంబై పోలీస్ ఫౌండేషన్లకు భారీ విరాళాలు ఇచ్చిన ఈ రియల్ హీరో.. తాజాగా లాక్ డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన సినీ కళాకారులు, కార్మికులకు అక్షయ్ అండగా నిలిచారు. ఆయన తాజాగా సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(సింటా)కు రూ. 45 లక్షల విరాళాన్ని అందించారు. దీని ద్వారా 1500 మందికి ఒక్కొక్కరికీ రూ. 3 వేల చొప్పున ఆర్ధిక సాయం అందనుంది.

SHARE

LEAVE A REPLY