వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా.. ఎమోషనల్ అయిన గెటప్ శ్రీను..

0
91

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- గెటప్ శ్రీను.. తెలుగు ప్రేక్షకులకు ఇది పరిచయం అక్కర్లేని పేరు. తనదైన శైలి కామెడీతో.. విభిన్నమైన గెటప్స్‌లో అందరినీ అలరిస్తూ బుల్లితెర కమల్ హసన్ అనిపించుకున్నాడు గెటప్ శ్రీను. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న ఫేక్ అకౌంట్లపై గెటప్ శ్రీనుకు బాగా కోపం వచ్చింది. తన పేరుతో ఎవరో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి యాంటీ పోస్టులు పెడుతున్నారని.. వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని ఈ జబర్దస్త్ కమెడియన్ లైవ్ వీడియోలో చెప్పాడు.

తాజాగా ఓ వీడియో చేసిన శ్రీను.. తనకు సోషల్ మీడియాలో ఉన్నది కేవలం రెండు అకౌంట్లు మాత్రమేనని.. అందులో ఒకటి పర్సనల్ అయితే.. మరొకటి పేజ్ అని తెలిపాడు. ఈ రెండు కాకుండా ఎవరో గెటప్ శ్రీను పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నారని చెప్పాడు. దానితో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. కాగా, ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నాడు.

SHARE

LEAVE A REPLY