ఇక్కడ ఫేడవుట్ అయితే అక్కడకు జంప్ అవడమే..!!

0
144

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –సౌత్ లో ఆఫర్ వచ్చింది అంటే అది తెలుగు, తమిళ భాషల్లోనే.. అందుకే ముంబై భామలకు టాలీవుడ్, కోలీవుడ్ లోనే మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులో ఈమధ్య ముంబై భామల హవా తగ్గినట్టు అనిపించినా సరే గ్లామర్ షో చేయడంలో మాత్రం వారి తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. తెలుగు తమిళ భాషల్లో కాస్త కెరియర్ సన్నిగిల్లుతుంది అనుకునే టైంలో కన్నడ, మళయాళ భాషల్లో ప్రయత్నిస్తారు.

అయితే అక్కడ హీరోయిన్స్ మాత్రం టాలెంట్ చూపిస్తే తెలుగు అవకాశాలను వెంటనే అందుకుంటారు. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ అందరు మళయాళ, కన్నడ పరిశ్రమల నుండి వచ్చిన వారే అవడం విశేషం. తెలుగు, తమిళంలో దశాబ్ధ కాలంపైగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర లీడ్ రోల్ లో వస్తున్న కబ్జా సినిమా కోసం కాజల్ ను అడిగితే ఆమె ఓకే చెప్పిందట. తెలుగు తెలుగు, తమిళ భాషల్లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ అక్కడ కూడా సత్తా చాటాలని చూస్తుంది. ఇక్కడ ఎలాగు కెరియర్ దాదాపు ముగిసినట్టు అనిపిస్తుండగా కన్నడలో కొత్తగా కెరియర్ మొదలు పెడుతుంది కాజల్.

అంతేకాదు అమ్మడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసేందుకు సై అంటుంది. ఇంతకుముందు కూడా హింది సినిమాల ప్రయత్నాలు చేసినా వర్క్ అవుట్ అవలేదు. ఇక ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది. గట్టిగా మరో ఐదారేళ్లు హీరోయిన్ గా చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇక సినిమాలను ఆపేయాలని అనుకుంటుంది కాజల్. అయితే ఈ ఐదేళ్లలో కూడా తను అన్ని పరిశ్రమల్లో సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది.

SHARE

LEAVE A REPLY