డిస్కోరాజా గ్రాఫిక్స్ వండర్స్‌గా మారతాయా?

0
105

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-మాస్ మహారాజ్ రవి తేజ మరోసారి తన పవర్ఫుల్ పెరఫార్మన్సుతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు, రవి తేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్సకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19న డిస్కో రాజా మ్యూజిక్ ఆల్బమ్ నుంచి మొదటి పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలానే ఈ చిత్రం లో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

డిస్కో రాజాకి గ్రాఫిక్స్ హంగులు

డిస్కో రాజా ను ఓ విజువల్ వండర్ గా రెడీ చేసేందుకు గ్రాఫిక్స్ కి పెద్దపీట వేసి నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నవీన్ నూలి ఎడిట్ ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతున్నాయి. ఇక వెన్నెల కిషోర్ హిలేరియస్ కామెడీ తో ప్రేక్షకలకు నవ్వుల విందు పంచనున్నాడు, బాబీ సింహా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. టైటిల్ కు తగ్గట్టుగా డిస్కోరాజా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయబోతుంది.

రవితేజ, పాయల్ రాజపుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్, ప్రొడక్షన్ – రామ్ తళ్లూరి, సమర్పణ – సాయి రిషిక, నిర్మాత : రజిని తళ్లూరి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విఐ ఆనంద్, సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్ : అబ్బూరి రవి, మ్యూజిక్ : థమన్. ఎస్, ఎడిటర్ : నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర. టి, కో డైరెక్టర్స్ : విజయ్ కామిశెట్టి, సురేష్ పరుచూరి, పిఆర్ఓ : ఏలూరు శ్రీను.

SHARE

LEAVE A REPLY