చరిత్రలో ఇదే హయ్యెస్ట్ – హీరోగారి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే చుక్కలే…..

0
466

Times of Nellore ( London ) – ప్రపంచ సినిమాలో చరిత్రలో జేమ్స్ బాండ్ సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్ని రకాల యాక్షన్, అడ్వంచర్, స్పై సినిమాలు వచ్చినా బాండ్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి 24 బాండ్ మూవీస్ వచ్చాయి. త్వరలో 25వ బాండ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సోలెస్, స్కై ఫాల్, స్పెక్టర్ చిత్రాల్లో నటించిన బాండ్ హీరో డేనియల్ క్రెయిగ్ నటించబోయే చివరి చిత్రం ఇది. ఈ సినిమా కోసం డేనియల్ క్రెయిగ్ తీసుకోబోయే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది.

ఎంత తీసుకుంటున్నాడో తెలుసా? తను నటించబోయే చివరి బాండ్ మూవీ కోసం డేనియల్ క్రెయిగ్ 50 మిలియన్ పౌండ్స్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాట. మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 448 కోట్లు. ఈ నెంబర్ చూసి సినీ ప్రేమికులు షాకవుతున్నారు. బాండ్ సినిమాల చరిత్రలో ఇదే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్. అలా అదనపు ఆదాయం కూడా అంతే కాదు… ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్రెడిట్ కూడా అతనికి ఇవ్వబోతున్నారు. దీని ద్వారా డేనియల్ క్రెయిగ్ అదనపు ఆదాయం పొందుతాడని తెలుస్తోంది. స్పెక్టర్ సినిమా కోసం ఎంత? డేనియల్ క్రెయిగ్ నటించిన గత జేమ్స్ బాండ్ మూవీ ‘స్పెక్టర్’ చిత్రానికి గాను 37 మిలియన్ పౌండ్స్ రెమ్యూనరేషన్ అందుకున్నారు. తాను ఇక బాండ్ సినిమాలు చేయను అని డేనియల్ గతంలోనే ప్రకటించారు. అయితే ఈ ఒక్కసారి చేయమని భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి అతడిని ఒప్పించారట నిర్మాతల. నిమిషాకి లక్షల పౌండ్స్ రాబోయే జేమ్స్ బాండ్ మూవీ రన్ టైమ్ 2 గంటల 20 నిమిషాలు ఉంటుందని.

ఈ లెక్క ప్రకారం స్క్రీన్ టైమ్ ఒక్కో నిమిషానికి 357,000 పౌండ్లు చార్జ్ చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. బాండ్ సినిమాల చరిత్రలోనే ఇది హయ్యెస్ట్ బాండ్ సినిమాల చరిత్రలోనే డేనియల్ క్రెయిగ్ తీసుకునే 50 మిలియన్ పౌండ్స్ అనేది హయ్యెస్ట్ రెమ్యూనరేషన్. తొలి నాళ్లలో సీన్ కానరీ 6 బాండ్ సినిమాలకుగాను 7 మిలియన్ పౌండ్స్ తీసుకున్నాడు. రోజర్ మూర్ 7 సినిమాలకుగాను 17 మిలియన్ పౌండ్స్ రెమ్యూనరేషన్ అందుకున్నాడు. జార్జ్ లెజెన్బై ఒక సినిమాకు 72వేల పౌండ్స్, తిమోతీ డాల్టన్ 2 సినిమాలకు 4 మిలియన్ పౌండ్స్, పీర్స్ బ్రోసన్ 4 సినమాలకు 13 మిలియన్ పౌండ్స్ అందుకున్నారు. వచ్చే ఏడాది విడుదల బాండ్ 25వ మూవీ షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం కాబోతోంది. 2019 చివర్లో ఈ మూవీ విడుదలయ్యే అవాకాశం ఉంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ఆస్కార్ విన్నర్ డానీ బోయెల్ దర్శకత్వం వహించబోతున్నారు. దర్శకుడికి రెమ్యూనరేషన్ రూపంలో 7 మిలియన్ పౌండ్స్ అందనున్నట్లు సమాచారం.

SHARE

LEAVE A REPLY