రియల్ కెప్టెన్ మిత్తాలి ..సినిమా లో కెప్టెన్ తాప్సి..!

0
121

Times of nellore – ✒కోట సునీల్ కుమార్✒ భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హీరోయిన్ తాప్సి కనిపించనుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా భారీ విజయాలను భారత్ ఖాతాలో వేస్తోంది మిథాలీ రాజ్. మహిళా క్రికెట్ జట్టులో సుదీర్ఘ కెరీర్ కొనసాగించి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న మిథాలీ జీవిత కథను సినిమాగా మలచాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి.

అయితే తాజాగా అందిన సమాచారం మేరకు మిథాలీ రాజ్ బయోపిక్‌కి సంబందించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని తెలిసింది. ఈ బయోపిక్ లో మిథాలీ పాత్రలో హీరోయిన్ తాప్సి నటించనుందని ఫిలిం నగర్ టాక్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి.. తాను మిథాలీ రాజ్ బయోపిక్ చేయబోతున్నట్లుగా హింట్ ఇచ్చింది. మిథాలీ రాజ్ బయోపిక్‌కి సంబందించిన స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ సినిమాలో ఎవరు నటిస్తారనేది నిర్మాణ సంస్థ ప్రకటిస్తేనే బాగుంటుందని తాప్సి చెప్పింది.

మిథాలీ పాత్రలో నటించే అవకాశం తనకు అవకాశం వస్తే అంతకన్నా సంతోషం మరొకటి ఉండదని ఈ సందర్బంగా తాప్సి చెప్పుకొచ్చింది. ఈ మధ్యకాలంలో ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ వస్తున్న తాప్సి టాలీవుడ్, బాలీవుడ్ తెరలపై హంగామా చేస్తోంది. ఇటీవలే గేమ్ ఓవర్ సినిమా ద్వారా సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది తాప్సి.

అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ తరుణంలో మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సి నటించనుంది అన్నట్లుగా వస్తున్న హింట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మిథాలీ బయోపిక్ ని త్వరలోనే మొదలుపెట్టి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుంచాలనేది మేకర్స్ ప్లాన్ అని తెలుస్తోంది.

SHARE

LEAVE A REPLY