సినిమా సెట్టింగ్‌లో విద్యుదాఘాతం – కార్పెంటర్ మృతి

0
116

Times of Nellore (Hyderabad) # కోట సునీల్ కుమార్ # – సినిమా సెట్టింగ్‌లో విద్యుదాఘాతంతో కార్పెంటర్‌ మృతి చెందాడు. కృష్ణానగర్‌కు చెందిన మెట్టు కాంతారావు కొంత కాలం నుంచి సినిమా సెట్టింగ్‌ పనులు చేస్తున్నాడు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ ఏడెకరాల్లో నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఓ సినిమా షూటింగ్‌లో పనిచేస్తున్నాడు. బుధవారం సెట్‌ కోసం మెషీన్‌తో చెక్కలు కోస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగలడంతో స్పృహతప్పి పడిపోయాడు. తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కార్మికులు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

SHARE

LEAVE A REPLY