ఒక్క చిటికెలో 1000 HD సినిమాలు డౌన్ లోడ్!!!

0
67

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒–ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ డేటాను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు రూపొందించారు. సినిమాల కోసం ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇక ఉండదంటున్నారు. వెయ్యి హై డెఫినిషన్ (HD)సినిమాలను సెకన్ కన్నా తక్కువ వ్యవధిలో డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఒకే ఆప్టికల్ చిప్ ను ఉపయోగించి..ఈ ఘనతను సాధించారు. సెకనుకు 44.2 టెరాబైట్ల (44.2 TBPS) అందుకున్నామని మొనాష్, స్విన్ బర్న్, ఆర్ఎంఐటీ నిపుణుల బృందం వెల్లడించింది.

ఆస్ట్రేలియా నేషనల్ బ్రాండ్ బ్యాండ్ నెట్ వర్క్ ఉపయోగించే నెట్ వర్క్ సదుపాయాల్లో ఈ మైక్రో కోంబ్ ను అమర్చి పరీక్షించారు. ఒక ఆఫ్టికల్ చిప్ ఇప్పటి వరకు చేయలేనంత..డేటాను ఉత్పత్తి చేయగలిగారు. బ్రాండ్ బిడ్త్ సదుపాయాలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని మొనాష్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్, కంప్యూటర్ సిస్టమ్స్ ప్రొఫెసర్ బిల్ కోర్కోరన్ తెలిపారు. ఒక్కో లేజర్ ను ప్రత్యేకమైన కమ్యూనికేషన్ ఛానల్ గా ఉపయోగించుకోవచ్చన్నారు.

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఇంటర్నెట్ సదుపాయాలకు ఫుల్ డిమాండ్ ఉంది. చాలా మంది మారుమూల ప్రాంతాల నుంచి ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని కోర్కోరన్ తెలిపారు. తాజా డేటాను సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రవాణా సదుపాయాల్లో సైతం ఉపయోగించుకోవచ్చని, ప్రపంచ అవసరాలకు సరిపడేలా..బ్రాండ్ విడ్త్ లను అందించే శక్తి మైక్రో కోంబ్లకు ఉందన్నారు.

SHARE

LEAVE A REPLY