చిరు 152 మూవీ కాస్ట్ & క్రూ

0
122

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-  మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కబోయే చిత్ర ఓపెనింగ్ కార్య క్రమాలు దసరా రోజు గ్రాండ్ గా పూర్తి అయ్యాయి. వచ్చే నెల నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసారు. ఇక ఈ మూవీ లో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ ను ఎంపిక చేసారని సమాచారం.

అలాగే తమిళ యంగ్ హీరో ఆర్య ఒక కీలకమైన రోల్ లో యాక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కథని మలుపు తిప్పే కీలక రోల్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటించబోతున్నారట. వీటిపై అతి త్వరలో చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. బాలీవుడ్ మ్యూజిక్ ద్వయం అతుల్-అజయ్ ఈ సినిమా కోసం సంగీతాన్ని అందించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు కొణిదెల, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నాయి.

SHARE

LEAVE A REPLY