“బ్రాండ్ బాబు” సినిమా పై కేసు నమోదు

0
550

Times of Nellore (Hyd) – బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ‘బ్రాండ్ బాబు’ సినిమా పై కేసు నమోదైంది. తన ఫోటోను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించడంపై ఓ మహిళా జర్నలిస్ట్‌ ఫిర్యాదు చేశారు. బ్రాండ్ బాబు సినిమాలో చనిపోయిన సన్నివేశంలో తన ఫోటో చూపారని బాధిత మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ 509 సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కన్నడ నటుడు సుమంత్ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు బుల్లి తెర స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్‌ దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మారుతి కథను సమకూర్చారు.

SHARE

LEAVE A REPLY