ప్రముఖ చానెల్‌పై దుమ్మెత్తి పోస్తున్న జూనియర్ అభిమానులు

0
1280

Times Of Nellore (cinema) :రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ చానెల్.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహానికి గురైంది. సోషల్ నెట్‌వర్క్‌లో సదరు ఛానెల్‌పై ఎన్టీఆర్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి కారణం.. దీపావళి రోజున ఆ చానల్ ‘జనతా గ్యారేజ్’ సినిమాను టెలికాస్ట్ చేయడమే. తమ అభిమాన హీరో సినిమాను పండుగ రోజున టెలీకాస్ట్ చేస్తే అందుకు సంతోషించాలి కానీ ఆగ్రహించడం ఎందుకు అనే అనుమానం రావొచ్చు. తమ అభిమాన హీరో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి, రూ. 100కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాను ఎలాగైనా కొన్ని థియేటర్లలో వందరోజులు ఆడించాలనేది అభిమానుల ప్లాన్. త్వరలో ఈ చిత్రం 50 రోజుల మార్క్‌ను దాటనుంది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన సెంటర్లలో 50 రోజుల పండుగను చేసి, దీన్నొక రికార్డుగా నెలకొల్పాలనేది కూడా ఆ ప్లాన్‌లో భాగం. అయితే, ఈ ఆశలపై నీళ్లు చల్లుతూ దీపావళి రోజున ఆ చానెల్ ‘జనతా గ్యారెజ్‌’ను టెలీకాస్ట్ చేస్తుండడంతో.. ఇక థియేటర్‌కు వచ్చి తమ హీరో సినిమాను ఎవరు చూస్తారు అని అభిమానులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. దీంతో ఆ ఛానెల్‌కు వ్యతిరేకంగా సోషల్ నెట్‌వర్క్‌లో తమ దాడిని మొదలు పెట్టారట. అయితే, ఎన్నోకోట్లు పెట్టి హక్కులు కొనుక్కున్న ఆ ఛానెల్ దీపావళి సందర్భంగా తమకు కలిసొచ్చే ప్రకటనల వ్యాపారాన్ని ఎలా వద్దనుకుంటుంది. దీపావళికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానుల ఆందోళనకు ఆ చానెల్ సద్దుమణగుతుందా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

SHARE

LEAVE A REPLY