“సర్కార్” చిత్రం పై బీజేపీ విమర్శలు

0
142

Times of Nellore  (Chennai) – సూర్య: దొంగిలించిన కథతో దొంగ ఓట్ల గురించి చిత్రం చేస్తారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌ విమర్శించారు. విజయ్‌ నటించిన చిత్రం అంటేనే విమర్శల పర్వం మొదలవుతుంది. తాజా చిత్రం సర్కార్‌ కథ విషయం వివాదంగా మారినా దాన్ని సమరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నారు. అయితే రాజకీ య పరమైన విమర్శలెక్కడా రావడంలేదే అనుకుంటున్న తరుణంలో బీజేపీ దాడి మొదలెట్టింది. ఇంతకు ముందు కూడా మెర్శల్‌ చిత్ర విషయంలో బీజేపీ రాద్దాంతం చేసిన విషయం తెలిసిందే. తాజగా అలాంటి రచ్చకే తెర లేసిందని చెప్పవచ్చు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌ సోమవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొందరు సినిమాల్లో నటించి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోదామని బయలుదేరారని విమర్శించారు. అలాంటి వాళ్లు సినిమాల్లో ముఖ్య మంత్రులు అవ్వవచ్చుగానీ.. ధరణిలో నరేంద్రమోదీనే ప్రధా ని అని పేర్కొన్నారు. ఆయన ఎవరిని భుజం తట్టి చూపిస్తారో ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్నారు.

SHARE

LEAVE A REPLY