బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు కరోనా.. తీవ్ర అందోళనలో టీవీ పరిశ్రమ..

0
159

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. చిన్నోడు పెద్దోడు అందరూ దీని బారిన పడుతున్నారు. లాక్ డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో సినీ, టీవీ నటులు షూటింగ్స్‌లలో పాల్గొంటున్నారు. ఇది ముఖ్యంగా బుల్లితెర నటులపై పంజా విసురుతుంది. వరుసగా అనేక మంది దీని బారిన పడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్, హరికృష్ణ, నవ్య స్వామిలకు కరోనా సోకడం జరిగింది. తాజాగా మరో టీవీ నటుడు దీని బారిన పడ్డాడు. తెలుగులో అనేక సీరియల్స్ లో నటించిన రవి కృష్ణకు కరోనా సోకిందని తెలుస్తోంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న రవి కృష్ణ వైద్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా వచ్చిందని నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు రవి కృష్ణను క్వారెంటైన్‌కు పంపించివేశారు. ప్రస్తుతం రవి కృష్ణ కరోనా చికిత్స తీసుకుంటున్నాడు. ఇక రవి కృష్ణతో గత కొన్ని రోజులుగా దగ్గరగా తిరుగుతున్న వారందరూ తీవ్ర అందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. నటుడు రవి కృష్ణ బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న సంగతి తెలిసిందే. సీరియల్స్‌లో కంటే ఇతను బిగ్ బాస్‌లో పాల్గోని చాలా పాపులర్ అయ్యాడు. ఇక ఒకరినుండి ఒకరికి కరోనా వ్యాప్తి చెందడంతో ఇప్పటికే టాలీవుడ్‌లో అన్నిరకాల షూటింగ్స్ నిలిపివేస్తున్నారు. మరో పక్క విడుదల కావాల్సిన చాలా సినిమాలు వాయిదాలు వేస్తూ నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నారు.

SHARE

LEAVE A REPLY