బాలయ్య నిర్మాతగా తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా ?

0
172

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ –ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలకృష్ణ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలకృష్ణ సొంతంగా సినిమాను నిర్మించాలని చెప్పి ఎన్ బికే ఫిలిమ్స్ ను స్థాపించారు. ఈ బ్యానర్ పైనే ఇకపై సినిమాలు చేయాలనీ, బయట సినిమాలు పక్కన పెట్టాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశాడు. ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా మంచి విజయం సాధిస్తుంది… బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఉంటాయని అనుకున్నారు.

అయితే, సినిమా రిలీజ్ అయ్యాక, బయోపిక్ తేలిపోయింది. సినిమా మొత్తం పాటలతో నింపేశారు. ఎన్టీఆర్ జీవితం గురించి కొత్తగా చెప్తారని అనుకుంటే… పాతగానే చెప్పడంతో పెద్దగా కలిసిరాలేదు. సినిమా ఫెయిల్ అయ్యింది. భారీ రేటుకు కొనుగోలు చేసిన బయ్యర్లు సినిమా రిలీజ్ తరువాత డీలా పడ్డారు. అయితే, మహానాయకుడు రాజకీయాలకు సంబంధించిన సినిమా కావడంతో ఆ మూవీ తప్పకుండా హిట్ అవుతుందని అనుకున్నారు.

కానీ, సినిమా రిలీజ్ అయ్యాక అది కూడా తలక్రిందులైంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమానే కాస్త బాగుందని టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా మోతంగా దాదాపు రూ. 40 నుంచి రూ 50 కోట్ల రూపాయల వరకు లాస్ వచ్చింది. బయ్యర్లు ఈ సినిమాద్వారా చాలా వరకు లాస్ అయ్యారు. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో విడుదల రోజు బాలకృష్ణ.. బోయపాటి సినిమాను అనౌన్స్ చేశారు. అదే సమయంలో ఈ బయోపిక్ ఫెయిల్ కావడంతో ఆ సినిమా వాయిదా పడింది.

కారణం భారీ బడ్జెట్ ఒకటైతే.. ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్ కావడం. ఈ రెండు కారణాల వలన బాలకృష్ణ.. బోయపాటి సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం సొంత బ్యానర్లో సినిమా చేయలేనని బాలయ్య చెప్పాడు. నిర్మాత దొరికితే సినిమా చేద్దామని చెప్పిన బాలయ్య ఈలోపు సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తో సినిమా కమిట్ అయ్యాడు. ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. కాగా, బోయపాటితో బాలకృష్ణ కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాను ద్వారకా ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నది. బాలయ్య సొంత బ్యానర్లో సినిమా చేస్తే.. ఎన్టీఆర్ బయోపిక్ బయ్యర్లకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి.. అందుకే బాలయ్య సొంత నిర్మాణంలో కాకుండా బయట నిర్మాతతో సినిమా చేస్తున్నాడు.

SHARE

LEAVE A REPLY