దన్షిక చిత్రానికి ఎనిమిది అవార్డులు

0
422
Times of Nellore చెన్నై,  దన్షిక ప్రధాన పాత్రలో ఆనందమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సినం’. ఈ చిత్రం కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ సంప్రదాయ చిత్రోత్సవాల్లో ఏకంగా ఎనిమిది అవార్డులను సొంతం చేసుకుంది. వారం రోజుల పాటు జరిగిన ఈ చిత్రోత్సవాల్లో ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన, సంప్రదాయ అంశాలతో రూపొందిన వందలాది చిత్రాలు పోటీ పడ్డాయి. తమిళంలో నుంచి ‘సినం’ పోటీ పడింది. అందులో భాగంగా ఉత్తమ నటిగా దన్షిక ఎంపికైంది. ఈ చిత్రంలో నటించిన పతిదా ఉత్తమ సహాయ నటిగా ఎంపికయ్యారు. సినిమాటోగ్రాఫర్‌ నటరాజన్‌, ఎడిటర్‌ దీపక్‌, సౌండ్‌ ఇంజినీరు సంపత్‌లకు కూడా ఉత్తమ అవార్డులు దక్కాయి. అంతేకాకుండా ఉత్తమ మహిళా చిత్రం విభాగంలో కూడా ఈ సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. మొత్తానికి ఎనిమిది అవార్డులను ఈ చిత్రం అందుకోవడం విశేషం. తమిళనాడు నుంచి పశ్చిమబెంగాల్‌కు వెళ్లే ఓ యువతి.. అక్కడ వేరే గత్యంతరం లేక పడుపు వృత్తిని ఆశ్రయించే కథతో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో వేశ్యపాత్ర పోషించారు దన్షిక. జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చారు. నేసన్‌ క్రియేషన్స్‌ బ్యానరుపై నేసన్‌ తిరునేసన్‌ నిర్మించారు.
Attachments area
SHARE

LEAVE A REPLY