‘అవతార్​ 2’ షూటింగ్ షురూ…స్పెష‌ల్ సెట్ రెడీ..!!

0
65

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒–జేమ్స్‌ కామెరూన్ తెర‌కెక్కించిన‌‌ వెండితెర విజువ‌ల్ వండ‌ర్ ‘అవతార్‌’కు సీక్వెల్ మూవీస్ రాబోతున్నాయి. అందులో భాగంగా ‘అవతార్‌ 2’ని 2021 డిసెంబరు 17న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ ముందుగానే అనౌన్స్ చేసింది. కానీ కరోనావైర‌స్ వీర‌విహారం చేయ‌డంతో.. ప‌రిస్థితులు ఊహించ‌నంత‌గా మారిపోయాయి. వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో షూటింగులు అర్ధాంత‌రంగా నిలిచిపోయాయి. సినిమా రిలీజులు సైతం ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల చిత్రపరిశ్రమలు షూటింగుల పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ‘అవతార్‌ 2’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి దర్శక నిర్మాతలు వ్యూహ‌ర‌చ‌న‌లు చేస్తున్నారు.

ఈ విషయాన్ని మూవీ ప్రొడ్యూస‌ర్ జాన్‌ లాండూ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. “మా అవతార్‌ కోసం స్పెష‌ల్ గా వేసిన సెట్లు రెడీ అయ్యాయి. వచ్చేవారంలో న్యూజిలాండ్‌లో షూటింగ్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అని పోస్ట్‌ చేశారు. సముద్ర గర్భం నేపథ్యంగా సాగే సీన్స్ షూట్ చేయ‌నున్నారు. ప్రత్యేకంగా వేసిన బోటు సెట్లకు సంబంధించిన ఫొటోలను జాన్ నెటిజ‌న్ల‌తో పంచుకున్నారు. కాగా అవ‌తార్ ఫ‌స్ట్ పార్ట్ సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. ప్రేక్ష‌కులను మ‌రో ట్రాన్స్ లోకి తీసుకెళ్లి మంత్ర ముగ్దుల్ని చేసింది ఈ చిత్రం. దానికి సీక్వెల్ అంటే ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి. మ‌రి మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మరికొంత‌కాలం వెయిట్ చేయాల్సిందే.

SHARE

LEAVE A REPLY