బిగ్ బాస్ 3 హోస్ట్‌గా టాప్ హీరోయిన్!

0
308

Times of Nellore (TV) –  బుల్లితెరపై బిగ్ బాస్ షో సృష్టించిన హంగామా అంతా ఇంతాకాదు. ఆ షో ప్రసారం చేస్తున్న టీవీ ఛానెళ్ల టీఆర్ఫీ రేటింగులను అమాంతం పెంచేసిన ఈ షో తెలుగులో ఇప్పటికే రెండు భాగాలు పూర్తిచేసుకుంది. సీజన్ 1 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా అదరగొట్టేయగా.. రెండో సీజన్‌లో ఆ బాధ్యతలు నాచురల్ స్టార్ నాని తీసుకున్నారు. ఈ రెండు సీజన్లు బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరించాయి.

ఇదిలా ఉండగా ఇక బిగ్ బాస్ సీజన్ 3 కోసం అంతా సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ షో ప్రారంభం కానుందట. అయితే ఈ షో కోసం మొదట ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేయాలనుకున్నారట కానీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోతున్నారని సమాచారం. కాగా తాజాగా బిగ్ బాస్ 3 హోస్ట్ బాధ్యతలను టాప్ హీరోయిన్‌కి అప్పజెప్పారని ఓ ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఆమె మరెవరో కాదు స్వీటీ అనుష్క అంటున్నారు. స్టార్ హీరోలకు దీటుగా వెండితెరపై అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న కారణంగా ఆమెను ఈ షో నిర్వాహకులు సంప్రదించారని తెలుస్తోంది. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో!

SHARE

LEAVE A REPLY