అజయ్‌ దేవగన్‌కు పితృ వియోగం

0
104

Times of Nellore (Mumbai)  #కోట సునీల్ కుమార్ #– బాలీవుడ్‌ ప్రముఖ హీరో అజయ్‌ దేవగన్‌ నివాసంలో విషాదం నెలకొంది. అజయ్‌ దేవగన్‌ తండ్రి, ప్రముఖ స్టంట్‌ డైరెక్టర్‌ వీరు దేవగన్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని సూర్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. సుమారు 80కి పైగా బాలీవుడ్ చిత్రాలకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన వీరు దేవగన్.. నటుడిగా, నిర్మాతగా కూడా పనిచేశారు. అలాగే తన కుమారుడు అజయ్‌ దేవగన్‌ హీరోగా హిందూస్థాన్ కీ కసమ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా వీరు దేవగన్ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 6గంటలకు విలే పార్లే శ్మాశాన వాటికలో జరగనున్నాయి. వీరు దేవగన్‌ మృతిపట్ల సంతాపం పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపంత తెలుపుతూ…అజయ్‌ దేవగన్‌కు సానుభూతి తెలిపారు.

SHARE

LEAVE A REPLY