అడిగి పెళ్లి చేస్తాం: రాహుల్‌ తల్లిదండ్రులు!!

0
132

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –బిగ్‌బాస్‌ హౌస్‌లో రాహుల్‌-పునర్నవిల రిలేషన్‌షిప్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీకెండ్‌లో వచ్చే నాగార్జున వారి మధ్య అలకలను, ప్రేమను గుర్తుచేస్తూ సెటైర్లు విసిరేవాడు. ఇక పునర్నవి రాహుల్‌కు గోరుముద్దలు తినిపించడం, అదే సమయంలో తప్పుచేస్తే అతన్ని చెడామడా తిట్టడం.. ఇంట్లో ఏం జరిగినా ఇద్దరు కలిసే ఉండటం ప్రేక్షకులను మెప్పించింది. ఓరోజు ఎలాగోలా ధైర్యం చేసిన రాహుల్‌.. డేటింగ్‌కు వస్తావా అని పునర్నవిని సరదాగా అడగడం అప్పట్లో హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

టాస్క్‌లు ఆడటం చేతకాదని పేరు తెచ్చుకున్న రాహుల్‌ .. పునర్నవి కోసం 20 గ్లాసుల కాకర జ్యూస్‌ను గటగటా తాగి ఆమెను నామినేషన్‌ నుంచి తప్పించాడు. దీంతో ఆనందం పట్టలేని పునర్నవి.. రాహుల్‌ను హత్తుకుని ముద్దులు కూడా ఇచ్చింది. ఇక పునర్నవి ఎలిమినేట్‌ అయినపుడు రాహుల్‌ వెక్కివెక్కి ఏడ్వటంతో ఆమెపై ఉన్న ప్రేమ మరోసారి బయటపడింది. పదకొండోవారంలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన పునర్నవి.. రాహుల్‌తో కలిసి ఫేస్‌బుక్‌ లైవ్‌ చేస్తానని అభిమానులకు మాటిచ్చింది. అటు గ్రాండ్‌ ఫినాలే స్టేజిపై రాహుల్‌ను విజేతగా ప్రకటించిన తర్వాత పునర్నవి తనను ఎంకరేజ్‌ చేసిందని ఆమెను పొగడ్తల్లో ముంచెత్తాడు.

SHARE

LEAVE A REPLY