ఘోరానికి మారు పేరు ట్రంప్‌ పాలనా…

0
147

Times of nellore – ✒కోట సునీల్ కుమార్✒ – అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పాలన అత్యంత ఘోరంగా ఉందని అమెరికాలోని బ్రిటన్‌ రాయబారి సర్‌ కిమ్‌ డరోచ్‌ పేర్కొన్నారు. ఆయన బ్రిటన్‌ ప్రభుత్వానికి పంపించిన నోట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ” మనం ఇటువంటి పాలనను మనం నమ్మలేము. చాలా సాధారణంగా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మొరటుగా ఉంది. ఎప్పుడైనా సమర్థంగా ఉంటుందేమో చూడాలి. జూన్‌లో ఆ దేశ అధ్యక్షుడి పర్యటన విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆయన కార్యవర్గం పూర్తి స్వార్థంతో ఉంది. ఇరాన్‌ విషయంలో అమెరికా పాలసీ అస్తవ్యస్తంగా.. ఒక దిశానిర్దేశం లేకుండా ఉంది.” అని పేర్కొన్నారు. ఈ విషయాలను దిమెయిల్‌ పత్రిక ప్రచురించింది. ఈ విషయాన్ని యుకే విదేశాంగ శాఖ ఒక తుంటరి చర్యగా పేర్కొని ఊరుకొందే గానీ, ఖండించలేదు. దీనిపై శ్వేతసౌధం స్పందించలేదు. కానీ ఈ విషయం అమెరికా-యుకే మధ్య సంబంధాలను ప్రభావితం చేయవచ్చు.

SHARE

LEAVE A REPLY