అత్యంత ఖరీదైన విడాకులు

0
124

Times of Nellore (Washington) # కోట సునీల్ కుమార్ # – జెఫ్‌ బెజోస్‌.. అమెజాన్‌ వ్యవస్థాపకుడు.. అపర కుబేరుడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరు. ఆయన నికర ఆస్తి 137 బిలియన్‌ డాలర్లు. పాతికేళ్ల వైవాహిక జీవితం తరువాత బెజోస్‌, ఆయన భార్య మెకంజీ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇద్దరూ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

‘‘కొన్ని నెలలుగా విడిగా ఎలా ఉండగలమనేది ప్రయోగాత్మకంగా చూశాం. విడిపోయి స్నేహితులుగా ఉండగలమనే నమ్మకం కుదిరాక చట్టబద్ధంగా విడాకులు తీసుకోవాలని నిశ్చయించాం’’ అని అందులో పేర్కొన్నారు. ఈ విడాకుల వల్ల జెఫ్‌ బెజోస్‌ తన ఆస్తిలో దాదాపు సగం -మెకంజీకి భరణంగా ఇవ్వాల్సి ఉంటుంది. దీని విలువ దాదాపు 62-15 బిలియన్‌ డాలర్లు. అంటే సుమారు 4.2 లక్షల కోట్లు మనోవర్తి ఇవ్వాలి. ప్రపంచ చరిత్రలో ఇంత భారీగా మనోవర్తి తీసుకోనున్న మహిళ మెకంజీయే కానుండడం విశేషం. అంతేకాదు, ఈ భరణం ద్వారా ఆమె ప్రపంచంలోనే అత్యధిక సంపన్నురాలైన మహిళ కానున్నారు.

కొన్నాళ్లుగా జెఫ్‌ బెజోస్‌ -లారెన్‌ శాంచెజ్‌ అనే ఫాక్స్‌ టెలివిజన్‌ హోస్ట్‌తో ప్రేమాయణం నెరపుతున్నారు. లారెన్‌ మాజీ భర్త, హాలీవుడ్‌ ఏజెంట్‌ ప్యాట్రిక్‌ వైట్సెల్‌ స్వయంగా లారెన్‌ను బెజోస్ కు పరిచయం చేయడం మరో విశేషం. లారెన్‌ లైసెన్స్‌ కలిగిన హెలికాప్టర్‌ పైలట్‌ కూడా. ఆమెకు ఏరియల్‌ ఫిల్మింగ్‌లో ఆమె నైపుణ్యం ఉండడమే కాకుండా అనేక హాలీవుడ్‌ సినిమాలకు ఆమె ఏరియల్‌ ఫిల్మింగ్‌ కన్సల్టెంట్‌ కూడా! కేవలం వారం కిందటే జెఫ్‌ బెజోస్‌ నేతృత్వంలోని అమెజాన్‌ – మైక్రొసా్‌ఫ్టను దాటి అత్యధిక టర్నోవర్‌ ఉన్న కంపెనీగా అవతరించింది. విడాకుల కారణంగా- కేవలం కొద్ది రోజుల్లోనే ఈ సీన్‌ రివర్స్‌ కాబోతోంది.

SHARE

LEAVE A REPLY