ఎండుకొబ్బరి ఎంతో మేలు!!

0
111

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –మిగతా డ్రైఫ్రూట్స్‌తో పోలిస్తే, ఎండుకొబ్బరికి ప్రాధాన్యం తక్కువే! దీనిలోని పోషకాలు, అవి అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ప్రతి వంటకంలో దీన్ని వాడడం మొదలుపెడతాం!

మెదడు మహ బాగు: ఎండుకొబ్బరి వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. ఎండుకొబ్బరిలోని పోషకాలు మెదడులో ‘మైలీన్‌’ అనే న్యూరో ట్రాన్స్‌మీటర్‌ ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా మెదడులో సంకేతాల ప్రసార వేగం పెరుగుతుంది. ఫలితంగా మెదడు చురుకుదనం పెరుగుతుంది.
గుండె పదిలం: ఎల్‌డిఎల్‌ (చెడు కొలెస్ట్రాల్‌) స్థాయిని తగ్గించి, హెచ్‌డిఎల్‌ (మంచి కొలెస్ట్రాల్‌) స్థాయిని పెంచుతుంది. ఫలితంగా గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు బలపడి, హృద్రోగాలు దరి చేరకుండా చూస్తుంది.
రక్తలేమి మాయం: రక్తలేమి వల్ల ఇన్‌ఫెక్షన్లు తొందరగా వ్యాపిస్తాయి. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఆహారంలో ఐరన్‌ ఉండేలా చూసుకోవాలి. ఐరన్‌ ఎక్కువగా ఉండే ఎండు కొబ్బరిని వంటకాల్లో చేరుస్తూ ఉంటే, రక్తలేమి సమస్య తగ్గుతుంది.
SHARE

LEAVE A REPLY