తిరుమలలో అద్దె గదుల ధరలు పెంపు!!

0
73

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –తిరుమలలో అద్దె గదుల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలన్నింటినీ గురువారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అమల్లోకి తెచ్చింది. నందకం అద్దె గదుల ధరలు ఇప్పటివరకు రూ.600గా ఉండేవి.. ఇప్పుడు రూ.1000కి పెరిగాయి. కౌస్తుభం, పాంచజన్యంలో అద్దె గదుల ధరలు రూ.500 నుంచి రూ.1000కి పెరిగాయి. వేంకటేశ్వరుడి భక్తులకోసం తిరుమలలో రూ.50 నుంచి రూ.3000 వరకు వసతి సదుపాయం ఉంది. రూ.100, రూ.500, రూ.600కు లభించే గదులను సాధారణ వసతి కింద లెక్కిస్తారు. అలాగే, రూ.999, రూ.1500తో లభించే గదుల్లో ఎసి సదుపాయం ఉంటుంది.

సామాన్యులు అధికంగా రూ.100కి వచ్చే వసతి గదుల్లో అత్యధికంగా ఉంటారు. ఆ గదులు దొరకకపోతే రూ.500, రూ.600 చెల్లించి సాధారణ వసతి గదల్లో ఉంటారు. కాగా, తిరుమలలో వసతి గదుల ధరలను పెంచినప్పటికీ తిరుపతిలో మాత్రం పెంచలేదు. రూ.100, రూ.200, రూ.300, రూ.400, రూ.600, రూ.800, రూ.1000కు లభ్యమయ్యే వసతి గదులను ఎప్పటిలాగే భక్తులు పొందవచ్చు.

SHARE

LEAVE A REPLY