ఈ పండు తింటే డెంగ్యూ దగ్గరికి కూడా రాదు .. !

0
223

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –తెలుగు రాష్ట్రాలను డెంగ్యూ జబ్బు పట్టి పీడిస్తుంది. దోమలు ఇంట్లోది రాకూడదని ఎంత ప్రయత్నించినా అవి వస్తాయి కుట్టి పోతాయి. దోమలు కుట్టడంతో డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. అయితే ఈ పండు తింటే డెంగ్యూ జ్వరం ఏమి చెయ్యలేదట. ఆ పండు ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి మనకు అతి తక్కువ ధరలో దొరికే పండు బొప్పాయి.

డెంగ్యూ జ్వరం వస్తే బ్లడ్ ప్లేట్‌లెట్ల సమస్య తలెత్తుంది. బొప్పాయి తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ల సమస్య తగ్గుతుందట. బొప్పాయి పండులో ఉండే విటమిన్లు.. వేరే ఏ పండులోనూ ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మొత్తం 14 ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి రోజు దీనిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.

బొప్పాయిలో విటమిన్ A,B,C,D,E లు అధికంగా ఉంటాయి. అందుకే మార్కెట్లో ఒక్కసారిగా బొప్పాయి పండుకు డిమాండ్ పెరిగింది. మరోవైపు డెంగ్యూ వ్యాపించడం కూడా దీనికి ప్రధాన కారణం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో బొప్పాయికి భారీగా డిమాండ్ ఏర్పడింది. మీరు బొప్పాయి తిని డెంగ్యూకి చెక్ పెట్టండి.

SHARE

LEAVE A REPLY