ముక్కుకు శస్త్రచికిత్సతో మూడేళ్లు తగ్గుతున్న వయసు!!

0
80

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-ముఖం అందంగా కనిపించేందుకుగాను ముక్కుకు చేయించుకునే శస్త్రచికిత్స(రైనోప్లాస్టీ)లతో మహిళల వయసు తగ్గుతుందని చెప్తున్నారు అమెరికా పరిశోధకులు! అదేంటీ.. వయసెలా తగ్గుతుంది.. అని ఆశ్చర్యపోతున్నారా? తగ్గడమంటే నిజంగా తగ్గడం కాదులెండి. వాస్తవ వయసుతో పోలిస్తే మూడేళ్లు తక్కువ వయసున్నట్లు కనిపిస్తారట. తాజా అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 16-72 ఏళ్ల మధ్య వయసున్న 100 మంది మహిళలను పరీక్షించారు. రైనోప్లాస్టీ చేయించుకోవడానికి ముందు, శస్త్రచికిత్స జరిగిన 12 వారాల తర్వాత మహిళలు తీసుకున్న ఫొటోలను ప్రత్యేక కృత్రిమ మేధస్సు(ఏఐ) సహాయంతో విశ్లేషించారు. రైనోప్లాస్టీ తర్వాత వారి వయసును ఏఐ సగటున మూడేళ్లు తక్కువగా చూపించింది. 40 ఏళ్లు పైబడినవారిలోనైతే వయసు ఏకంగా ఏడేళ్లు తక్కువగా కనిపించింది.

SHARE

LEAVE A REPLY