కొవ్వు కరుగుతుంది కదా అని ఎక్కువగా వ్యాయామాలు చేస్తే!!

0
34

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరానికే కాదు.. లోపల ఉన్న పార్ట్స్‌ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కొంతమంది ఉదయం లేవగానే వ్యాయామం చేయనిదే ఏ పనీ చేయరంటే అతిసయోక్తి కాదు. ఎందుకంటే.. తరచూ వ్యాయామం, వాకింగ్స్, జాగింగ్స్ చేయడం ద్వారా మనసు ప్రశాంతతో పాటు రీఫ్రెష్‌గా కూడా ఉంటుంది.

కానీ నిజానికి చాలా మంది బాడీలోని కొవ్వు తగ్గుతుందని చేస్తూంటారు. అలా తెలిసీ తెలియక ఏ వ్యాయామాలు పడితే అవి చేసి ప్రమాదాలకు గురైన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కువ సేపు ఎక్సర్ సైజ్ చేస్తే.. ఎక్కువగా కొవ్వు తగ్గుతుందనుకుంటే మాత్రం.. అది భ్రమే. ఎప్పుడైనా ఒకేసారి వ్యాయామం చేయకూడదు. సాధారణంగా రోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది.

మితిమీరిన వ్యాయమాలు ఎక్కువగా చేయడం వలన ఎముకలు విరగడంతో పాటు హార్ట్ ఎటాక్స్, రకాలైన జబ్బులు కూడా వస్తాయట. అలాగే వీరు ఒక పనిని పదే పదే చేస్తూంటారని, ఒకేసారి ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటారని బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

వ్యాయమం చేసేవారు ఒకేసారి కొన్ని రకాల ఆహారాలను తినడం మానేయకూడదని, కొద్దికొద్దిగా ఆహార శైలిలో మార్పులు చేసుకోవాలని వారు చెప్పారు. దాదాపు 100 మందిపై ఈ రకమైన టెస్టులు నిర్వహించినట్లు డాక్టర్లు తెలిపారు. కాబట్టి.. కొవ్వు కరుగుతుంది కదా అని ఎక్కువ సేపు వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని వారు సూచించారు

SHARE

LEAVE A REPLY