జుట్టు రాలిపోతుందా? జుట్టుకు ఇది ‘జీవ’కర్ర

0
711

Times of Nellore ( Health ) – చర్మాన్ని, జుట్టును కాపాడుకోవడానికి అనేకమైన మందులు, క్రీములు మార్కెట్‌లో లభ్యమవుతూనే ఉంటాయి. అయితే ఇంట్లో పదార్థాలతోనే వీటిని కాపాడుకునే అవకాశం చాలావరకూ ఉంది. మనం వంటల్లో వాడుకునే జీలకర్రకు ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. జీలకర్రతో మన జుట్టు, చర్మాన్ని ఎలా కాపాడుకోవచ్చంటే..!

చర్మానికి సంబంధించిన ఎన్నో ఇన్ఫెక్షన్స్‌కు ఇది మందుగా పనిచేస్తుంది. జీలకర్ర కలిపిన నీళ్లను ముఖానికి పది నిమిషాల పాటు రుద్దితే సరిపోతుంది. అప్పుడు ముఖం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.

జుట్టు రాలిపోవడం చాలా మందిలో ఉన్న సమస్య. ఎన్నో మందులు వాడినా ఉపయోగం ఉండదు. అందుకు పరిష్కారంగా కూడా జీలకర్రను వాడచ్చు. నిద్రపోయేముందు జీలకర్ర నూనెను తలకు బాగా పట్టేలా రాసుకుని, ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి.

జుట్టు రాలిపోవడానికి ప్రధానమైన కారణం చుండ్రు. కాలుష్యం కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. మూడు టేబుల్‌ స్పూన్ల జీలకర్రను ఓ పది నిమిషాల పాటు నీటిలో ఉడి కించాలి. ఈ మిశ్రమం చల్లబడ్డాక, దాన్ని జుట్టుకు పట్టించాలి. అప్పుడు జుట్టు నిగనిగలాడుతూ, ఆరోగ్యంగా ఉంటుంది. ముఖం మీద ఎలర్జీలు, కాలిన గాయాలు చేసే మచ్చలు చాలా కాలం పాటు ఉంటాయి. ఇలాంటప్పుడు జీలకర్ర మంచి ఔషధంగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు జీలకర్రను నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే లేచి దాన్ని పేస్ట్‌గా చేసుకుని, ముఖానికి పట్టించుకోవాలి.

SHARE

LEAVE A REPLY