ఇలా కూడా బరువు తగ్గవచ్చు!!

0
115
Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –బాలీవుడ్‌ నటి పరిణీతీ చోప్రా సినిమాల్లో రాణించడం కోసం ఏకంగా 26 కిలోల బరువు తగ్గారు. స్వతహాగా భోజన ప్రియురాలు కావడం, వ్యాయామం ఇష్టపడని తత్వం మూలంగా, ఆలస్యంగా అయినా తను ఎంచుకున్న పంథాలో బరువు తగ్గి చూపించారు. ఇంతకీ పరిణితి ఎంచుకున్న ఆ వ్యాయామాలు ఏవంటే….
జిమ్‌లో అలుపొచ్చేలా వ్యాయామాలు చేయడానికి ఇష్టపడని పరిణీతీ, అదే ఫలితాలను అందించే ఇతర పనుల మీద దృష్టి పెట్టారు. వ్యాయామంతో సమానమైన డాన్స్‌, కేరళ మర్మకళలు ఆమెను ఆకట్టుకున్నాయి. దాంతో వాటినే ఎక్కువగా సాధన చేసింది. దాంతో 86 కిలోల నుంచి ఏకంగా 26 కిలోల బరువు తగ్గి, 60 కిలోలకు చేరుకున్నారు. ఇంతకీ బరువు తగ్గాలనే ఆలోచన ఆమెకు అంత హఠాత్తుగా ఎందుకు కలిగింది? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ…. ‘‘శరీరం లావుగా ఉండడం వల్ల కొన్ని రకాల దుస్తులకే పరిమితం అయిపోవలసివస్తోంది. పైగా చిత్రసీమలో రాణించాలంటే నటన ఒక్కటే సరిపోదు, నాజూకుతనం కూడా అవసరం. కాబట్టే బరువు తగ్గాలని గట్టిగా నిశ్చయించుకుని ప్రయత్నించాను. బరువు తగ్గాను’’ అని చెబుతున్నారు పరిణీతీ చోప్రా.
ఉదయాన్నే జాగింగ్‌ ధ్యానం
గంట పాటు యోగా సాధన
ఈత, గుర్రపు స్వారీ
ట్రెడ్‌మిల్‌ మీద పరుగు
కొవ్వు కరిగేలా డాన్స్‌ చేయడం
కార్డియోతో పాటు రోజువారీ ఇతర వ్యాయామాలు
SHARE

LEAVE A REPLY