ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా..?…ఈ డేంజరస్ న్యూస్ మీకే…..??

0
113

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – ప్రస్తుత కాలంలో మనిషి కనిపెడుతున్న నూతన రకాల ఎలక్ట్రానిక్ మరియు ఇతర రకాల పరికరాల వలన ఉపయోగం ఎంతో ఉంటూ, మనకు అవి ఎన్నో విధాలా శ్రమను తగ్గిస్తున్నప్పటికీ, వాటివలన కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటున్నాయి. వాస్తవానికి ఏ వస్తువైనా మితంగా వాడితే బాగుంటుంది, అదే శృతిమించితే దానివలన కలిగే దుష్ఫలితాలతో కొన్ని సమస్యలు కూడా కొని తెచ్చుకోవాల్సి వస్తుందనే విషయం మాత్రం మర్చిపోకూడదు. ఇక నేటి కాలంలో సెల్ ఫోన్ వినియోగం అందరికీ తప్పనిసరి అవడంతో, మనలో ఎక్కువమంది మధ్య మధ్యలో పాటలు వినడం, వీడియోలు చూడడం వంటి వాటికోసం ఇయర్ ఫోన్స్ ని విపరీతంగా వాడుతున్నారు.

ఇక సెల్ లో ఎక్కువసేపు కాల్స్ మాట్లాడేవారు రేడియేషన్ వల్ల తమకు ఇబ్బంది వస్తుందని భావించి, ఇయర్ ఫోన్స్ ద్వారా మాట్లాడడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఈ విధంగా అతిగా ఇయర్ ఫోన్స్ వినియోగం వలన కొన్ని రకాల డేంజరస్ సమస్యల బారిన పడడం ఖాయం అని అంటున్నారు డాక్టర్లు. అయితే వారు చెప్తున్న ప్రకారం, ఇప్పటికిప్పుడు కాకపోయినా మెల్లగా రోజులు గడిచే కొద్దీ, ఎవరైతే రోజులో ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ వినియోగిస్తారో, వారికి చెముడు వచ్చే అవకాశం చాలా ఎక్కువని అంటున్నారు. అదీకాక, బడ్స్ ఉన్న ఇయర్ ఫోన్స్ మరింత డేంజర్ అని వారు చెప్తున్నారు. బడ్స్ ఉన్న ఇయర్ ఫోన్స్ వలన ఎక్కువగా చెవుల్లో చెమట చేరి, తదనంతరం దురదగా మారడం, మరికొందరిలో పుండ్లు పుట్టడం వంటివి జరుగుతాయట.

ఇక మరీ ముఖ్యంగా ఒకరు వాడిన బడ్స్ ఉన్న ఇయర్ ఫోన్స్ మరొకరు వాడితే, అవతలి వారి చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్స్ వంటివి మనకు వెంటనే సోకె అవకాశం ఉంటుందట. అంతేకాక, రోజులో ఐదు గంటలకు మించి ఇయర్ ఫోన్స్ వినియోగించేవారికి కర్ణభేరి సమస్యలతో పాటు చెవిపోటు కూడా వచ్చే అవకాశం కూడా ఎక్కువట. కాబట్టి ఎక్కువగా అవసరం ఉన్నంతవరకే మనం ఇయర్ ఫోన్స్ వినియోగించాలని, అలానే బడ్స్ ఇయర్ ఫోన్స్ కాకుండా సాధారణమైన స్పీకర్ బయటకు ఉండే ఇయర్ ఫోన్స్ వాడుకుంటే కొంతవరకు బెటర్ అని అంటున్నారు డాక్టర్లు. సో విన్నారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్కువగా ఇయర్ వినియోగిస్తుంటే, ఇకనైనా ఆ అలవాటుని సాధ్యమైనంతవరకు తగ్గించి మీ చెవులను కాపాడుకోండి…..!!

SHARE

LEAVE A REPLY