అధిక బరువుకు కలబందతో చెక్‌

0
146

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – అధిక బరువు సమస్యతో బాధపడుతున్న చాలామంది వెయిట్‌ లాస్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు. అలాకాకుండా సహజంగా బరువు తగ్గించుకోవడానికి ఇంట్లోనే చాలా చిట్కాలు ఉన్నాయి. వాటిలో కొన్ని.. కలబంద రసాన్ని గ్రీన్‌ టీలో కలుపుకొని, తాగితే బరువు తగ్గుతారు. కలబంద జ్యూస్‌లో ఫైటోస్టెరోల్స్‌, విసిరల్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉంటాయి. శరీరం లోపల కొవ్వును కరిగించడంలో కలబంద సహాయపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ అలోవెర జ్యూస్‌ను రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోవడం వల్ల స్లిమ్‌గా తయారుకావచ్చు.
కలబంద రసంలో ఉండే ఫైటో స్టెరాల్స్‌ అంతర్గతంగా జీవక్రియ రేటును రెట్టింపు చేస్తాయి. ఫలితంగా శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు ఈ జీవక్రియలో వినియోగించబడి శరీర బరువు తగ్గుతారు. శరీర బరువు తగ్గించే అద్భుతమైన మరో ఔషదం అల్లం. కప్పు నీటిలో చెంచా కలబంద రసం, చెంచా అల్లం రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద ఎక్కువ సమయం మరిగించాలి. చల్లారిన తర్వాత తాగాలి. క్రమం తప్పకుండా తాగితే అధిక బరువు సమస్య తీరుతుంది. యాంటీ ఆక్సిడెంట్‌లను అధికంగా కలిగి ఉండే గ్రీన్‌ టీ శరీర బరువును తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది.

SHARE

LEAVE A REPLY