ఇంతకూ నేనెవరిని…?

0
1079

Times of Nellore ( Nellore ) – ఇటీవల ప్రకటించిన జెఇఇ ఫలితాలలో కార్పోరేట్ విద్యాసంస్థలు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నాయి. ర్యాంకర్లు మా వాళ్లంటే.. మా వాళ్లని పోటీ పడి ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే జెఇఇ ఫలితాలలో ఒపెన్ క్యాటగిరిలో మొదటి ర్యాంక్ సాధించిన బోగి సూరజ్ కృష్ణ (HT NO: 11720999) అనే విద్యార్ధి తమ కళాశాలలో చదివి ఉత్తమ ర్యాంక్ సాధించాడని నారాయణ విద్యాసంస్థలు ప్రకటించాయి. అదే సూరజ్ కృష్ణ తమ కళాశాల విద్యార్ధి అని శ్రీ చైతన్య విద్యాసంస్థలు హాల్ టికెట్ నంబర్ తో సహా ప్రకటించుకున్నాయి. తాను ఏ కళాశాల విద్యార్థో అర్థం కానీ అయోమయ స్థితోలోకి చేరుకోవడం సూరజ్ కృష్ణ కుటుంబ సభ్యుల వంతైంది. కార్పోరేట్ కళాశాలల లీలలు ఏలా ఉంటాయో అనడానికి ఇది ఒక ఉదాహరణ. జరుగుతున్న ఈ పరిణామాలతో తమ బిడ్డల భవిషత్త్ కోసం ఏ కళాశాలలను ఎంచుకోవాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు. విద్యారంగంలో వేళ్లూనుకున్న కార్పోరేట్ రంగం తమ ప్రతిష్ట కోసం ఒకరికోకరు పోటీపడుతూ విద్యార్ధులను, తల్లితండ్రులను అయోమయ స్థితిలోనికి నెట్టివేస్తున్నాయి.

SHARE

LEAVE A REPLY