పదివేల పోస్టుల రైలొచ్చింది!

0
841

Times of Nellore – కేంద్రప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకునేవారికి రైల్వేశాఖ అవకాశాన్ని మోసుకొచ్చింది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో 8619 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకీ, 1120 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకీ ప్రకటన విడుదల చేసింది. కానిస్టేబుల్‌ పోస్టులకు విద్యార్హత కేవలం పదోతరగతే! ఎస్‌ఐ పోస్టులకు డిగ్రీ! కానిస్టేబుల్‌ పోస్టుల్లో దాదాపు సగం పోస్టులను మహిళలకు కేటాయించటం విశేషం. పైగా వచ్చిన ఏ భాషలోనైనా పరీక్షను రాయగలిగే అవకాశం. అర్హతలున్నవారు దరఖాస్తు చేసి, పరీక్షకు సిద్ధమైతే ఆశించిన కొలువును చేజిక్కించుకోవచ్చు.

తగిన శారీరక ప్రమాణాలున్న అభ్యర్థులు పదోతరగతి విద్యార్హతతో రైల్వే కానిస్టేబుల్‌ ఉద్యోగం, డిగ్రీ ఉత్తీర్ణతతో ఎస్‌ఐ ఉద్యోగంలో ప్రవేశించే అవకాశాన్ని తాజా నోటిఫికేషన్‌ అందిస్తోంది. కానిస్టేబుల్‌ పోస్టుకు రూ.21,700, ఎస్‌.ఐ. పోస్టులకు రూ. 35,400 జీతం లభిస్తుంది.

కానిస్టేబుల్‌ కొలువులకు 01.07.2018 నాటికి 18 నుంచి 25 ఏళ్ళలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ పోస్టులకు 20 నుంచి 25 ఏళ్ళలోపు వయసు ఉన్నవారు పోటీపడవచ్చు. 4,216 కానిస్టేబుల్‌ పోస్టులనూ, 301 ఎస్‌ఐ పోస్టులనూ మహిళలకు కేటాయించారు. ప్రణాళికబద్ధంగా 3 నెలల కాలాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఈ ఉద్యోగ సాధన కష్టమేమీ కాదు.

పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునేవారు రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తిచేయాలి. దరఖాస్తు చేసే సమయంలో ఏ జోన్‌కు దరఖాస్తు చేయాలనుకున్నారో ‘పోస్ట్‌ ప్రిఫరెన్స్‌’లో వివరాలు నమోదు చేయాలి. తమకు నచ్చిన ఏ జోన్‌కైనా అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.

రాతపరీక్షలో 120 ప్రశ్నలను 3 విభాగాలుగా విభజించారు. 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.

జనరల్‌ అవేర్‌నెస్‌ – 50 మార్కులు
అరిథ్‌మెటిక్‌ – 35 మార్కులు
జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌ – 35 మార్కులు.

ప్రతి సరైన సమాధానానికీ ఒక మార్కు, తప్పు సమాధానానికి 1/3 వంతు రుణాత్మక మార్కులున్నాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, ఇతర రాష్ట్ర భాషల్లోనూ ఉంటుంది. పరీక్ష సమయంలో అభ్యర్థులు ఏదైనా ఒక భాషను ఎంచుకోవాలి. వారికి ప్రశ్నలన్నీ ఆ భాషలోనే ఇస్తారు.

SHARE

LEAVE A REPLY