పరీక్ష లేకుండానే.. రైల్వేలో 3553ఉద్యోగాలు..అప్లై చేశారా..?

0
1611

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –  కేవలం , పది , ఐటీఐ అర్హతతో వేల సంఖ్యలో రైల్వే ఉద్యోగాలకు అవకాశం వచ్చింది . వెస్ట్రన్ రైల్వేలో 3553 ఖాళీలు ఉన్నాయి . ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఆర్‌ఆర్ సీ దరఖాస్తులు అడుగుతోంది .

ఈ అప్రెంటీస్ లో అనేక ట్రేడులు ఉంటాయి . అన్ని కలిపి మొత్తం ఖాళీలు : 3553 ఉన్నాయి . ఇక ట్రేడుల విషయానికి వస్తే . ఫిట్టర్ , వెల్డర్ , టర్నర్ , మెషినిస్ట్ , కార్పెంటర్ , పెయింటర్ , మెకానిక్ , తదితరాలు ఉన్నాయి .

ఈ ఉద్యోగాలకు అర్హత : పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ( ఎన్‌సీవీటీ / ఎస్సీ వీటీ … ఉత్తీర్ణులై ఉండాలి . వయసు : 16-24 ఏళ్ల మధ్య ఉండాలి . రాత పరీక్ష ఉండదు .. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది .

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది . ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 07, 2020 న ప్రారంభమైంది . ఫిబ్రవరి 6 న ముగుస్తుంది . మరిన్ని వివరాల కోసం

https://www.rrenwr.com/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు .

SHARE

LEAVE A REPLY