తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

0
65

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ చాలా సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. స్వామివారిని నిన్న 71,691 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,588 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.9 కోట్లుగా ఉంది.

SHARE

LEAVE A REPLY