శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం – ఈవో సింఘాల్

0
311

Times of Nellore ( Tirumala ) – శ్రీవారి చెంతన ఒక్క ఏడాదిలోనే రెండోసారి పండుగ వచ్చింది. ఈ ఏడాది అధిక మాసం కావడంతో శ్రీవారికి సెప్టెంబర్‌లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు టీటీడీ నిర్వహిస్తోంది. ఇప్పటికే వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియగా, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసినట్లు ఈవో సింఘాల్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ శ్రీవారికి సెప్టెంబర్‌లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏ విధంగా నిర్వహించామో.. అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. నవరాత్రి సందర్భంగా తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అధిక సిబ్బందని ఏర్పాటు చేశామన్నారు. 3వేల మంది శ్రీవారి సేవకులు, 4 వందల మంది ఎన్‌సీసీ కేడర్స్, వెయ్యిమంది స్కౌటర్స్ అండ్ గైడ్స్‌, అదనంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఈవో సింఘాల్ పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY