శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం

0
193

Times of Nellore (Tirumala)  # కోట సునీల్ కుమార్ #- తిరుమలలో శనివారం సాయంత్రం శ్రీవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా పాల్గుణమాసంలో పౌర్ణమినాడు ముగిసేలా ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయంలో పూజాదికాలు పూర్తయిన తర్వాత సాయంత్రం సీత, లక్ష్మణ, అంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లను మాడవీధుల ప్రదక్షిణగా స్వామివారి పుష్కరిణికి తీసుకొచ్చారు. కోనేరులో అందంగా ముస్తాబైన తెప్పపై ఉత్సవర్లను అధిష్ఠింపచేశారు. మంగళవాయిద్యాలు, అన్నమయ్య సంకీర్తనలు, వేదమంత్రోచ్చారణలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ మూడు ప్రదక్షిణల అనంతరం ఉత్సవర్లను ఆలయానికి వేంచేపు చేశారు. కాగా, రెండో రోజు ఆదివారం సాయంత్రం రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి తెప్పపై పుష్కరణిలో విహరించనున్నారు.

SHARE

LEAVE A REPLY