తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల!!

0
170

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2020 మే నెలకు సంబంధించి 72,773 టికెట్లు విడుదల చేశారు. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 11,498 సేవా టికెట్లు విడుదలయ్యాయి. సుప్రభాతం 8143, తోమాల 120, అర్చన 120, అష్టాదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2075, కరెంటు బుకింగ్‌ కింద 61,275 ఆర్జిత సేవాటికెట్లు విడుదల చేశారు. విశేష పూజ 2000, కలాణోత్సవం 14,725, ఊంజల్‌సేవ 4,650, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 15,400, సహస్రదీపాలంకరణ 16,800 సేవా టికెట్లను విడుదల చేశారు.

SHARE

LEAVE A REPLY