సమయ నిర్దేశిత సర్వదర్శనం ప్రారంభం

0
323

Times of Nellore ( Tirumala ) – తిరుమలలో భక్తులకు శ్రీవారి సులభ దర్శనం కల్పించడానికి తితిదే సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీనిపై ఇప్పటికే పలు దఫాలు ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఇక నుంచి పూర్తి స్థాయిలో అమలుచేసేందుకు సన్నద్ధమవుతోంది. భక్తులకు టోకెన్లు జారీ చేసేందుకు తిరుమల- తిరుపతి రెండు కాలినడక మార్గాల్లో 109 కౌంటర్లను ఏర్పాటుచేసింది. తిరుమల, తిరుపతిలోని కేంద్రాలలో సోమవారం 17 వేలు, మంగళవారం 11 వేల మందికి టోకెన్లు ఇచ్చింది. అధికారికంగా ప్రారంభించినట్లు చెప్పకుండానే ఈ విధానం అమలులోకి రావడం విశేషం. ఈ రెండు రోజులూ ఎలాంటి లోటుపాట్లు తలెత్తలేదు. దీంతో ఇకపై పూర్తి స్థాయిలో అమలుకు ఉపక్రమించింది. శ్రీవారికి జరిగే వారపు సేవలు, ఇతరత్రా కైంకర్యాలను దృష్టిలో ఉంచుకుని నిత్యం 23 వేల నుంచి 38 వేల మందికి టోకెన్లు జారీ చేయనుంది. టోకెన్‌ పొందిన భక్తులు 24 గంటల వ్యవధిలో తమకు అనువైన సమయాన్ని ఎంచుకుని ఆ మేరకు క్యూలైన్లలోకి వెళ్లాల్సి ఉంటుంది. వీరికి గరిష్ఠంగా మూడు గంటల్లో స్వామివారి దర్శనం కలిగే అవకాశం ఉందని తితిదే చెబుతోంది.

SHARE

LEAVE A REPLY