తిరుమ‌ల క‌నుమ‌దారిలో ప్ర‌మాదం

0
1067

Times Of Nellore ( Tirumala ) -తిరుమల మొదటి కనుమదారిలో సుమో బొల్తా పండింది. విశాఖపట్నంకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనం అనంతరం కొండపై నుంచి తిరుపతికి తిరుగు పయనమయ్యారు. అద్దె వాహనంలో వస్తున్న సమయంలో ఏడవ మైలు వద్ద సుమో తిరగబడింది. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు పిల్లలతో సహా మొత్తం 11 మంది వాహనంలో ఉన్నారు. ఒక బాలుడికి తీవ్రగాయాలవ్వ‌గా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చోదకుడు అతి వేగంగా వాహ‌నం నడపడంతో ప్రమాదం జరిగినట్లు భక్తులు చెబుతున్నారు.

SHARE

LEAVE A REPLY