జగన్‌ను కలిసిన రమణదీక్షితులు

0
257

Times of Nellore (Tirumala) #కోట సునీల్ కుమార్ #– వైకాపా అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్‌ తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహం వద్ద ఆయనకు ఘనస్వాగతం లభించింది. తితిదే ఈవో అనిల్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు జగన్‌కు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం జగన్‌ను శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కలిశారు.

ఈ రాత్రికి పద్మావతి అతిథిగృహంలోనే జగన్ బస చేయనున్నారు. బుధవారం ఉదయం 8.15 నిమిషాలకు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం కడప పర్యటనకు వెళ్తారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో జగన్‌కు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు, నేతల ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి అలిపిరి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత జగన్‌ తిరుమల చేరుకున్నారు.

SHARE

LEAVE A REPLY