ఆనందనిలయం దాటనున్న శ్రీవారు.. టీటీడీ కీలక నిర్ణయం!!

0
68

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ బ్రహ్మాండ నాయకుడు ఆనందనిలయం దాటనున్నాడు. తిరుమలేశుడు ఆలయం వెలుపలికి రానున్నాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల ఆలయం దాటి బయటికి రాబోతున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మలయప్ప స్వామి నవంబర్ 1వ తేదీ నుంచి ఆనంద నిలయం నుంచి బయటికి రాబోతున్నాడు.

కరోనా ప్రబావం కారణంగా ఏడు నెలలుగా ఆనంద నిలయానికే పరిమితమైన దేవదేవున్ని భక్తుల దర్శనార్థం నవంబర్ 1వ తేదీ నుంచి బయటికి తీసుకురాబోతున్నారు. ఏడు నెలల తర్వాత బయటికి రానున్న మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ సేవను ఆలయం వెలుపల నిర్వహించాలని టీటీడీ ట్రస్టు బోర్డు మంగళవారం నిర్ణయించింది. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు వర్చువల్ విధానంలో చేయాలని టీటీడీ నిర్ణయించింది.

SHARE

LEAVE A REPLY