కుటుంబ స‌మేతంగా శ్రీవారి సేవ‌లో మంత్రి

0
1009

Times Of Nellore ( Tirumala ) తిరుమ‌ల శ్రీ‌వారిని రాష్ట్ర ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి అమ‌ర్‌నాథ్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. తెల్ల‌వారుజామున విఐపీ విరామ స‌మ‌యంలో కుటుంబ స‌మేతంగా శ్రీ‌వారి స‌న్నిధికి చేరుకున్న మంత్రి కుటుంబానికి ఆల‌య అధికారులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ద‌గ్గ‌రుండి ద‌ర్శ‌నం చేయించారు. ద‌ర్శ‌నం త‌రువాత రంగ‌నాయ‌క మండ‌పంలో మంత్రి కుటుంబానికి తిరుమ‌లేశుని తీర్థ‌ప్ర‌సాదాల‌న‌ను అందించిన అర్చ‌కులు, ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి అమ‌ర్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సుభీక్షంగా ఉండ‌టంతోపాటూ స‌కాలంలో వ‌ర్షాలు కురిసి, ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో జీవించాల‌ని తిరుమల శ్రీ‌వారిని వేడుకున్న‌ట్లు తెలిపారు.

SHARE

LEAVE A REPLY