శ్రీవారిని దర్శించుకున్న జగన్

0
148

Times of Nellore (Tirumala) # కోట సునీల్ కుమార్ # – ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించిన వైఎస్‌ జగన్‌ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ గుండా స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఇతర భక్తులకు ఇబ్బంది కలుగకుండా సామాన్య భక్తుడిలా క్యూలైన్‌లో వెళ్లి ఆయన శ్రీవారి దర్శించుకున్నారు. వైఎస్‌ జగన్‌ వెంట వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు ఉన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వైఎస్‌ జగన్‌ తిరుమలలోని విశాఖ శారదా పీఠం చేరుకున్నారు. అక్కడ పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వైఎస్‌ జగన్‌ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేయనున్న ఆయన.. శుక్రవారం ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్నారు.

SHARE

LEAVE A REPLY