తిరుపతి లో హై అలెర్ట్

0
172

Times of Nellore (Tirupati)   # కోట సునీల్ కుమార్ #– శ్రీలంకలో ఉగ్రదాడుల జరిగిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ హై అలర్ట్‌ ప్రకటించింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. దాంతో తిరుమలతోపాటు అర్బన్‌ జిల్లాలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేయాలని సిబ్బందికి ఎస్పీ అన్బురాజన్‌ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు జనసమ్మర్థం ఉండే ప్రదేశాల్లో తనిఖీలు చేస్తున్నామన్నారు.

యాత్రికులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులుగాని, వస్తువులుగాని కనిపిస్తే డయల్‌ 100కు, పోలీస్‌ వాట్సప్‌ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక బాంబు, డాగ్‌ స్క్వాడ్లు రైల్వేస్టేషన్లు, బంస్టాండ్లు, అతిథి గృహాలు, దేవాలయాల్లో తనిఖీలు నిర్వహించాయి. రేణిగుంట, శ్రీకాళహస్తిలోనూ తనిఖీలు చేశాయి. అనుమానాస్పదంగా కనిపించిన వారి వివరాలను తెలుసుకున్నారు. వారి లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు.

SHARE

LEAVE A REPLY