శ్రీవారి ఆలయంలో 18 నుంచి అధ్యయనోత్సవాలు….

0
583

Times Of Nellore ( Tirumala ) – తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 18 నుంచి జనవరి 11వతేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఏటా వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనం (అధ్యయనోత్సవం) ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా జియ్యంగార్లు స్వామివారి ప్రాశస్త్యంపై 12మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్టిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు రంగనాయకుల మండపంలో పారాయణం చేస్తారు.

SHARE

LEAVE A REPLY